న్యూస్‌రీల్
మున్సిపల్ పదవులకు ఆశావహుల దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు
నిర్మల్
అగ్ని ప్రమాదాలపై
చైతన్యం కల్పించాం
నిర్మల్‌టౌన్: ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యం కల్పించామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముందుగా అగ్నిమాపక శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రిటైర్డ్ ఉద్యోగులను సత్కరించారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై వారంరోజులు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమతంగా వ్యవహరిస్తే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో భారీ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. కా ర్యక్రమంలో సీపీవో జీవరత్నం, జిల్లా ఇండస్ట్రీయల్ అధికారి నరసింహారెడ్డి, డీఈవో భోజ న్న, ఫైర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భైంసాటౌన్: జిల్లాలోని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందడి మొదలైంది. ఇప్పటికే నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో అధికారులు ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయా బల్దియాల్లో నలుగురు చొప్పున సభ్యులకు పాలకవర్గంలో చోటు దక్కనుంది. ఇక, ఖానాపూర్‌లో వివిధ పరిణామాల నడుమ ఇటీవల నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయితే, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ప్రధాన పార్టీల తరఫున పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నిర్మల్‌లో 25,
భైంసాలో 4 దరఖాస్తులు...
జిల్లా కేంద్రమైన నిర్మల్ మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యంతో అధికారం చేజిక్కించుకుంది. దీంతో సంఖ్యాబలం పరంగా దాదాపుగా అధికార పార్టీకి చెందిన సభ్యుల ఎన్నిక లాంఛనం కానుంది. అయితే, అన్ని పార్టీల నుంచి 25 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భైంసా మున్సిపల్‌లో బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కలిసి పాలకవర్గం కొలువుదీరింది. దీంతో ఇక్కడ బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిసి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. 12 సీట్లు గెలుపొందిన ఎంఐఎం కూడా తమ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా లేదా తేలాల్సి ఉంది. ఇక్కడ సోమవారం వరకు 4 దరఖాస్తులు వచ్చాయి.
చేతులెత్తే విధానంలో..
ఈనెల 21న సాయంత్రం వరకు అధికారులు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం మూడు రోజుల తరువాత అర్హుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఆ తరువాత కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. బరిలో నలుగురు మాత్రమే నిలిస్తే కౌన్సిల్ ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చైర్మన్ సమక్షంలో కౌన్సిల్ సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నిక జరుపుతారు.


