ఘనంగా బసవేశ్వర జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బసవేశ్వర జయంతి

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బసవేశ్వర చిత్రపటానికి అదనపు కలెక్టర్లు, అధికారులతో కలిసి పూలమాలలు వేసి అంజ లి ఘటించారు. నాటి కాలంలోనే సమాజంలో అసమానతలను తొలగించి, సమానత్వాన్ని సాధించేందుకు బసవేశ్వర మహారాజ్‌ కృషి చేశారన్నారు. మహిళల హక్కులు, మహిళ వివక్షత నిర్మూలన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బ సవేశ్వర మహారాజ్‌ అని పేర్కొన్నారు. ప్రతి ఒ క్కరూ బసవేశ్వర మహారాజ్‌ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివా స్‌, మోహన్‌సింగ్‌, పలువురు సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement