భైంసాకు నిధులివ్వండి | - | Sakshi
Sakshi News home page

భైంసాకు నిధులివ్వండి

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

భైంసా: భైంసా పట్టణ అభివృద్ధి కి నిధులు ఇవ్వాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ శ్రీదేవిని మున్సిపల్‌ చైర్మన్‌ తుమోల్ల దత్తాత్రి కోరారు. హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులపై వినతిపత్రం సమర్పించారు. భైంసా పట్టణంలో పెరుగుతున్న జనా భా, విస్తరిస్తున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధి అత్యవసరమ ని వివరించారు. ముఖ్యంగా రహదారుల ని ర్మాణం, డ్రైనేజీ మెరుగుదల, తాగునీటి సరఫ రా, వీధి దీపాల ఏర్పాటు, పార్కులు, పబ్లిక్‌ సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీదేవి, భైంసాకు నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement