సారంగపూర్/మామడ: రైతులు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మ ల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మామడ, పొన్కల్,కొరిటికల్, పరిమండల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల కొనుగోలుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు రోడెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ఈవి షయంలో పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో మాట్లాడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఇప్పించామన్నారు. అందుకే ప్రస్తుతం ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను విస్తరించామని తెలిపారు. కార్యక్రమాల్లో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ భీంరెడ్డి,తహసిల్దార్ శ్రీనివాస్‌రావు,ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ఏవో సంద్య, పీఏసీఎస్ సీఈవో రాజేందర్, ఆలూరు సర్పంచ్ ఈర్ల చిన్నయ్య, ధని సర్పంచ్ బడి పోతన్న, వైకుంఠాపూర్ సర్పంచ్ జంగం ఆనంద్, నాయకులు రావులరాంనాథ్,బాపురెడ్డి,కోండ్ర రాజారెడ్డి,చిన్నారెడ్డి పాల్గొన్నారు.


