కోతులు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

కోతులు పట్టివేత

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా స్థాని కులు ఎదుర్కొంటున్న కోతుల సమస్య పరిష్కారా నికి సోమవారం మున్సిపల్‌ శాఖ శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు ముందు, పదవీ బాధ్యత స్వీకరణ అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి ఇచ్చిన మాట ప్రకా రం కోతులను పట్టించి కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో వదిలేసే పనులు ప్రారంభించారు. కోతులు పట్టేవా రిని పిలిపించి వాటిని పట్టి వాటిపై రంగులు చల్లి అటవీ ప్రాంతానికి తరలించనున్నారు. కోతులు పట్టేవారు వాటిని పట్టణ శివారులో, దగ్గరలో వది లేస్తే గుర్తుపట్టే విధంగా కోతులపై ఈ రంగులు చల్లుతున్నారు. ఈ కోతుల పట్టివేత కార్యక్రమం కొనసాగుతుందని అతి తొందరలోనే పట్టణ ప్రజ లకు కోతుల సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, కౌ న్సిలర్లు చెనిగారపు నరేశ్‌, గోపు గోపి, లక్కాకుల హరీశ్‌, కత్తి నరేందర్‌, నాయకులు రాజేందర్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement