వరి ధాన్యం తూకం చేయాలి
లోకేశ్వరం: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని, కేంద్రం ప్రారంభించిన వెంటనే ధాన్యం తూకం చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని కన్కపూర్, అబ్దుల్లాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించక పోతే రైతులతో కలిసి కల్లూర్ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, గ్రామాల సర్పంచులు సునీల్, దడిగే జయలలిత, బీజేపీ మండల కన్వీనర్ బోడికె సాయన్న, జోహర్‌పూర్ సర్పంచ్ దయానంద్, ఆత్మా చైర్మన్ గన్ను నర్సారెడ్డి, ఏవో గిరిరాజ్, ఏపీఏం భోజన్న, నాయకులు మెండె శ్రీధర్, మహేందర్‌రెడ్డి, దడిగే భోజన్న, మంద బాస్కర్ ఉన్నారు.


