నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభకు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం స్కాలర్ షిప్ లభించింది. కళాశాలలోని ఏడుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ను నిర్వాహకులు సోమవారం అందజేశారు. ఇంటర్‌లో సాధించిన మార్కులకు ఈ స్కాలర్షిప్ అందజేశారు. బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎన్.హరిత, పి.అక్షయ, బి జెడ్‌సీ ప్రథమ సంవత్సరం చదువుతున్న పి.శ్రావ్య, ప్రత్యూష, సాధన, సవిత, ఎంఎస్‌సీఎస్ విద్యార్థిని బి.హర్షితకు స్కాలర్‌షిప్ రావడంపై ప్రిన్సిపాల్ డి.కవిత హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రిన్సిపల్ ఎస్.వీణ అధ్యాపకులు పాల్గొన్నారు.


