మాజీ ఎంఈవోపై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎంఈవోపై చర్య తీసుకోవాలి

Apr 22 2026 7:48 AM | Updated on Apr 22 2026 7:48 AM

నిర్మల్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని పంజేషాగల్లీ ఉర్దూ ప్రాథమిక పాఠశాలను అకారణంగా మూసివేసిన నిర్మల్‌ అర్బన్‌ మాజీ ఎంఈవోపై చర్య తీసుకోవాలని మేవా, టీఎస్పీటీఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీఈవో భోజన్నకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఎంఈవోగా పనిచేసిన నాగేశ్వరరావు విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాల మూసివేయించారని పేర్కొన్నారు. వారం రోజుల్లో పాఠశాలను తిరిగి తెరవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇందులో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షబ్బీర్‌ అలీ, సాజిద్‌, ప్రవీణ్‌కుమార్‌, మక్షుత్‌ అహమ్మద్‌, అసిఫ్‌, ఫాజిల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement