కడెం: మండలంలోని దిల్దార్‌నగర్, ఎలగడప, సారంగపూర్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో కొండపై కొలువుదీరిన శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రోత్సవాలు ఈనెల 22 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్ తెలిపారు. ఈనెల 30న లక్ష్మీనరసింహుడి జన్మదినం(తిరునక్షత్రం)అభ్యంగము, అభిషేకం, అలంకరణ, నారసింహా సహ్రసనామార్చన, తనియవిన్నపం, తీర్థప్రసాదగోష్టి తదితర పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు వొద్దిపర్తి వెంకటరమణచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు.


