మా చెరువులు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

మా చెరువులు పట్టవా?

Apr 22 2026 7:48 AM | Updated on Apr 22 2026 7:48 AM

– వివరాలు 8లోu బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

స్థానిక పాలకులకు పట్టింపు లేదు.. ఇచ్చేవారు పట్టించుకోరు తాజాగా 12 జలాశయాల్లో బోటింగ్‌ అనుమతి నిర్మల్‌ జిల్లాను లెక్కలోకి తీసుకోని వైనం..

నిర్మల్‌

ఈవీఎం గోదాం తనిఖీ

నిర్మల్‌చైన్‌గేట్‌: కలెక్టరేట్‌ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, చీఫ్‌ ఎలెక్టోరల్‌ కార్యాలయ ఈవీఎం రాష్ట్ర నోడల్‌ అధికారి బి.హరిసింగ్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈవీఎం గోదాం తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, అధికారులు సర్ఫరాజ్‌, రాజశ్రీ, బీజేపీ, టీడీపీ, ఆమ్‌ఆద్మీ, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రవణ్‌రెడ్డి, సిరికొండ రమేశ్‌, హైదర్‌, మజార్‌, ముజాయిద్‌ అలీ పాల్గొన్నారు.

నిర్మల్‌: వరుస కట్టినట్లుండే గొలుసుకట్టు చెరువులకు రాష్ట్రంలోనే నిర్మల్‌ ప్రసిద్ధి. ఎప్పుడో 450 ఏళ్ల క్రితం కాకతీయుల స్ఫూర్తితో ఓరుగల్లు రాజ్యం తరహాలో నిమ్మల చుట్టూ జలాశయాలను నిర్మించారు. జిల్లాకు ఏ మంత్రి వచ్చినా, ఏ నేత వచ్చినా వీటి గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ.. ఇతర జిల్లాల్లో చెరువులను ఎలా అభివృద్ధి చేశారో.. ఇక్కడా అలాగే చేయండి.. అని స్థానిక పాలకులు, నేతలు, అధికారులూ అడగటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమేనన్నట్లు.. తాజాగా పర్యాటకాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని 12జలాశయాల్లో బోటింగ్‌ను ప్రవేశపెట్టనుంది. అలాగే పలు అభివృద్ధి పనులనూ చేపట్టనున్నారు. ఇందులో ఇన్ని చెరువులున్న జిల్లా నుంచి ఒక్కటీ లేకపోవడం గమనార్హం.

గొలుసుకట్టు.. తీసికట్టు..

కొయ్యబొమ్మలు, కోటబురుజులే కాదు.. నిర్మల్‌ అంటే గొలుసుకట్టు చెరువులకూ పేరొందింది. జిల్లాకేంద్రంతోపాటు మండలాల్లోనూ మినీ ప్రాజెక్టులను తలపించేలా చెరువులు ఉన్నాయి. నిర్మల్‌లోని గొలుసుకట్టు చెరువులను పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. కానీ పట్టించుకునే వారు లేరు. జిల్లాకేంద్రమైనా.. ఇక్కడ కనీసం ఒక పార్కు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు లేకపోవడంతో ఉన్న చెరువుల్లోనైనా బోటింగ్‌ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా జిల్లావాసులు కోరుతూనే ఉన్నారు. గతంలో నిర్మల్‌ బస్టాండ్‌ పక్కనున్న ధర్మసాగర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌ చేస్తామని నిధులు వెచ్చించినా ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత వాకింగ్‌ ట్రాక్‌ వేసినా, వ్యూపాయింట్‌ కట్టినా ఏమాత్రం లాభం లేకుండా పోయాయి. ఆ చెరువులో ఇప్పటికీ మురికినీరు కలుస్తుండటంతో ఆ వైపు వెళ్లడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. గతంలో ఒకరిద్దరు కలెక్టర్లు బంగల్‌చెరువు, కంచెరోని చెరువులో బోటింగ్‌ కోసం ప్రయత్నించినా అవి కార్యరూపం దాల్చలేదు.

కబ్జాలకు పనికొస్తున్నాయి..

సిద్దిపేట కోమటి చెరువు మొదలు అన్ని జిల్లాల్లో చెరువులు, జలాశయాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతుంటే.. జిల్లాలో మాత్రం కబ్జాలకు కేరాఫ్‌గా మారుస్తున్నారు. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే చాలా చెరువులు కబ్జాల్లో ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల చుట్టూ కందకాలు తవ్వించినా లాభం లేకుండాపోయింది. చాలాచోట్ల వాటిని పూడ్చేసి మరీ, ఆక్రమణలు చేస్తున్నారు. లేక్‌ కమిటీ ఉన్నా.. ౖపైపె చర్యలే తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం పర్యాటకాభివృద్ధి పేరుతోనైనా పనులు చేపడితే చెరువులను కాపాడుకోవచ్చన్న భావన ఉంది.

జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువు

పట్టించుకోరూ...!

అడిగేదెవరు..?

‘అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు..’ అని అంటారు. అలాంటిది జిల్లాకు ఇది కావాలి, అది కావాలి.. అని అడగకపోతే ఇచ్చేదెవరూ..!? అని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు చాలా చెరువులు ఉన్నా.. ఇక్కడి నుంచి కనీసం ఒక్క ప్రతిపాద కూడా వెళ్లలేదు. దీతో తాజాగా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్న చెరువుల జాబితాలో జిల్లా పేరు లేదు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే నాలుగు చెరువులను ఎంపిక చేశారు. మన నేతలు, అధికారులు అడిగితే ఒక్క చెరువుకై నా చోటు దక్కేది. ఇక జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పర్యాటక మంత్రి అయినా కనికరించలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నీ ఉన్నా.. పట్టించుకుని, అడిగేవారు లేకపోవడంతో జిల్లాకు అభివృద్ధి పనులు రావడం లేదని జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్‌, కేంద్రానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడేస్థాయి ఉన్న నేతలూ ఉన్నారు. కానీ.. ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఇందుకు ప్రధానంగా జిల్లా నుంచి చిన్నచిన్న ప్రతిపాదనలైనా పంపించడం లేదన్నది స్పష్టమవుతోంది. సీఎం స్వయంగా హామీ ఇచ్చిన యూనివర్సిటీపైనే కదలిక లేకపోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికై నా పాలకులు, అధికారులు, అధికార పార్టీ నేతలూ పట్టించుకోవాలని, అభివృద్ధికి పాటుపడాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement