ఓలలో వర్షపు నీటిని తొలగిస్తున్న రైతులు
నిర్మల్ మార్కెట్ యార్డులో ఆరబోసిన మక్కలు
ధాన్య తడవకుండా టార్పాలిన్ కప్పుతున్న రైతు
జిల్లాలో మంగళవారం ఉదయం అకాల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న, జొన్న ధాన్యాలు తడిశాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడ్డారు. కుంటాల మండలం ఓలా గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన మొక్కజొన్న పంటపై రైతులు టార్పాలిన్లు కప్పుకున్నారు. నిర్మల్ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న మార్కెట్ యార్డ్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్


