నిర్మల్‌టౌన్: నిర్మల్ అల్ఫోర్స్ జూనియర్ కళా శాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ సెషన్–2 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చా రు. ఎస్.వర్తినిరెడ్డి ఆల్ ఇండియా–211 ర్యాంక్, కె.నచికేత్–593 , సీహెచ్.కవి–5,711, బి.తన్మయ్–13,326, సాయి శృతి–12,037, ఎండీ.సనాన్ ఉర్ రెహ్మన్–19,419 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. చైర్మన్ డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు.
మెరిసిన భైంసా విద్యార్థి..
భైంసాటౌన్: పట్టణానికి చెందిన పల్సికర్ సూర్యతేజ జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. సోమవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో ఆలిండియా 1549, ఓబీసీ విభాగంలో 279 ర్యాంకు సాధించాడు. పల్సికర్ శ్రీనివాస్, పద్మ దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, వీరి కుమారుడు సూర్యతేజ 9వ తరగతి వరకు భైంసాలోని ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ వరకు హైదరాబాద్‌లో చదువగా, ప్రస్తుతం ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో చైర్మన్ నరేందర్‌రెడ్డి


