కేజీబీవీ విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

Apr 22 2026 7:48 AM | Updated on Apr 22 2026 7:48 AM

● అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

కడెం: కేజీబీవీ విద్యార్థులు చదువు, క్రీడలతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో మంగళవారం స్టూడెంట్‌ టాలెంట్‌ ఫెస్ట్‌లో క్విజ్‌, డిబేట్‌, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మందుల స్టోర్‌ పరిశీలించి ,స్టాక్‌ రికార్డులు తనిఖీ చేశారు. తర్వాత మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో తహసీల్దార్‌ లచ్చిరాం, ఎంపీడీవో సునీత, ఎంపీవో శ్రీనివాస్‌, ఎంఈవో షేక్‌ హుస్సేన్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి శివకుమార్‌, కేజీబీవీ ఎస్‌వో విమల, హౌసింగ్‌ ఏఈ వంశీ, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement