నిర్మల్‌టౌన్: జిల్లా న్యాయస్థాన సముదాయాల్లో ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బంది, పోలీసులకు అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలో వైద్య సదుపాయాల విభాగాన్ని మంగళవారం ప్రారంభించారు. ఇక్కడ ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలను ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవిందర్, మొదటి, రెండవ జూనియర్ సివిల్ జడ్జీలు భవిష్య, నిఖిత, స్పెషల్ జూనియర్ మేజిస్ట్రేట్ నర్సయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యుడు ముఖేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.


