ప్రశాంతంగా ప్రవేశ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ప్రవేశ పరీక్షలు

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆరో తరగతిలో 216 విద్యార్థులు పరీక్షల కు హాజరు కావాల్సి ఉండగా 32 విద్యార్థులు, 7 నుంచి పదో తరగతి వరకు 164 విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 24 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ ఎత్రాజ్‌ రాజు తెలిపారు. వైష్ణవి అనే విద్యార్థిని చేయి విరిగినా తొమ్మిదో తరగతి ప్రవేశం కోసం పరీక్ష రాసేందుకు హాజరైంది.

తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

కుంటాల: కుంటాల ఆదర్శ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన 6 తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పరిశీలించారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట డీఈవో దర్శనం భోజన్న, ఎంఈవో ముత్యం, సీఎస్‌ ఎత్రాజ్‌ రాజు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement