అడెల్లిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

అడెల్లిలో భక్తుల సందడి

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

సారంగపూర్‌: అడెల్లి శ్రీమహాపోచమ్మ ఆల యం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నలుమూలలతోపా టు పొరుగు జిల్లాలైన నిజమాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు అమ్మవారికి హారతి, అభిషేకం, నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఆలయంలో భ క్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్సై శ్రీకాంత్‌ బందోబస్తు పర్యవేక్షించారు. 108 అంబులెన్స్‌ అందుబాటులో ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement