తమిళనాడు ఎన్నికలకు నిర్మల్‌ పోలీసులు | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు ఎన్నికలకు నిర్మల్‌ పోలీసులు

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

నిర్మల్‌ టౌన్‌: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు నిర్మల్‌ నుంచి 20 మంది హోంగార్డులు వెళ్తున్నారని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా మెడికల్‌ కిట్లను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో నిబద్ధతతో అప్రమత్తంగా పనిచేసి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రయాణం, విధుల సమయంలో ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్‌రావు, శేఖర్‌, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, హోం గార్డులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement