నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయులకు జనగణనపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవరత్నం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. న్యూమరేటర్లు, సూపర్వైజర్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ రియుమరేషన్ విధానాన్ని పూ ర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ జనగణనలో సరైన కచ్చితమైన సమాచారం సేకరణ అత్యంత కీలకమన్నారు. ఉపాధ్యాయులకు మూడు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్ పద్ధతులపై అవగాహన పెంచుకుని, జనగణన సమర్థవంతంగా నిర్వహించాలని సూచించా రు. రాష్ట్ర మాస్టర్ ట్రైనర్ పీజీ.రెడ్డి, జిల్లా పరిశీలకుడు సౌరభ్, జిల్లా మాస్టర్ ట్రైనర్ రమేశ్, ఎస్‌వోలు లింబాద్రి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


