● అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
మామడ: ఉపాధిహామీ కూలీలకు పనిప్రదేశంలో వసతులను కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని మామడ, లింగాపూర్ గ్రామాలలో శనివారం పర్యటించారు. మామడ చెరువులో పూడికతీత పనులు పరిశీలించారు. కూలీ లకు కల్పించిన వసతులను పరిశీలించారు. నీడ, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఉదయమే పనులకు హాజరు కావాలని సూచించారు. అనంతరం లింగాపూర్ గ్రామంలో నర్స రీ పనులను, పొనికి వనం పెంపకాన్ని పరిశీ లించి వివరాలు తెలుసుకున్నారు. మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో సుశీ ల్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీవో శివాజీ పాల్గొన్నారు.


