ఖానాపూర్: కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా చైర్‌పర్సన్‌గా డాక్టర్ జయశ్రీని నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఖానాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈమేరకు జయశ్రీకి శనివారం నియామకపత్రం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచన మేరకు జిల్లాస్థాయిలోని అన్ని అనుబంధ విభాగాలకు బాధ్యులను నియమిస్తున్నట్లు వివరించారు. పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు చేరువ కావాలన్నారు.


