దస్తురాబాద్‌లో
గొడుగులు పట్టుకుని వెళ్తున్న చిన్నారులు
ఎర్రబడ్డ జిల్లా చిత్రమే ఎండ తీవ్రత జిల్లాలో ఎలా ఉందో చెప్పడానికి సాక్ష్యం. పొద్దు పొడిచింది మొదలు.. గంటగంటకూ వేడెక్కుతూనే ఉంది. పట్టపగలు పగబట్టినట్లు భానుడు నిప్పుల సెగలు కక్కుతున్నాడు. ఏప్రిల్ రెండోవారంలోనే ఎండ మండిపోతోంది. మొన్నటివరకు 42 డిగ్రీలకే ‘అమ్మో..’అనుకుంటే, శనివారం ఏకంగా 44.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దస్తురాబాద్ మండలం బుట్టాపూర్‌లో నమోదైన ఈ ఉష్ణోగ్రత ఈ సీజన్‌లో రాష్ట్రంలోనే అత్యధికం కావడం గమనార్హం. తీవ్రమవుతున్న ఎండల నుంచి ముందుజాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. – (నిర్మల్/దస్తురాబాద్)


