‘సీతక్కపై అసత్యప్రచారం సహించం’ | - | Sakshi
Sakshi News home page

‘సీతక్కపై అసత్యప్రచారం సహించం’

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

ఖానాపూర్‌: మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు శనివారం సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం బొజ్జు మాట్లాడారు. సోషల్‌ మీడియాలో కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఆదివాసీ మహిళ అయిన మంత్రిపై అసత్య ప్రచారం తగదని, ఇది కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆ సమయంలో పరిమితస్థాయిలో జరిగిన అభివృద్ధిని పెద్దగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని విస్తృతస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రచారానికి కాకుండా పనితీరుకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేవారు. ఏడో వార్డులో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పడిగెల భూషణ్‌, ఎంఏ మాజిద్‌, గాడ్పు సత్యం, దయానంద్‌, పొలంపెల్లి రమేశ్‌, పుప్పాల శంకర్‌, గొర్రె గంగాధర్‌, జమాల్‌ ఖురేషి, జంగిలి శంకర్‌, జన్నారపు శంకర్‌, ద్యావతి రాజేశ్వర్‌, శ్రీనివాస్‌రెడ్డి, స్వప్నిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement