అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ నిబంధనల మేరకు అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాస్థాయి అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నా రు. అర్హత ఉన్న ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాల అధికారి, కమిటీ సభ్యులపై ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మార్గదర్శకాలను కలెక్టర్‌ వివరించారు. ముఖ్యంగా క్రిమినల్‌ నేపథ్యం ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కార్డులు జారీ చేయకూడదని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకో వాలన్నారు. త్వరలోనే జిల్లా స్థాయి అక్రిడిటేషన్‌ కమిటీ పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఇ.విష్ణువర్ధన్‌, కమిటీ సభ్యులు అల్వాల హనుమంతు, కొండూరి రవీందర్‌, అల్లం అశోక్‌, ఆర్‌.మహేందర్‌, ఎంఏ. వసీం, రామెళ్ల రాజేశ్వర్‌, సిరిపురం నాగరాజు, ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement