● డీడబ్ల్యూవో వినూత్న | - | Sakshi
Sakshi News home page

● డీడబ్ల్యూవో వినూత్న

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

● డీడబ్ల్యూవో వినూత్న

పోషకాహార లోపం

నివారణకు పోషణ్‌ పక్వాడ

నర్సాపూర్‌ (జి): చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలలో పోషకాహార లోపాలను తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు పోషణ్‌ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి(డీడబ్ల్యూవో) వినూత్న అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషకాహారంపై శనివారం అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి వ్యాధులు దరి చేరకుండా కాపాడాలన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి, సీడీపీవో నాగలక్ష్మి, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ లక్ష్మీవిశారద, ఐసీపీఎస్‌ దేవి మురళి, మిషన్‌ శక్తి డిస్టిక్ర్ట్‌ కోఆర్డినేటర్‌ సవిత, కేజీబీవీ ఎస్‌వో వీణ, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement