బాసర: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌పై హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో వైదిక బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఇన్‌చార్జి ఈవో విజయరామారావు, స్థానాచార్యులు ప్రవీణ్‌పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్‌పూజారి మాస్టర్ ప్లాన్ అంశాలను స్థాపతికి వివరించారు. ఈ ప్లాన్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై చర్చించారు. అనంతరం తుది నివేదికను శృంగేరి పీఠాధిపతికి అందజేయనున్నట్లు వెల్లడించారు. శృంగేరి పీఠాధిపతి అనుమతి తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు.


