రక్తహీనతను నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

రక్తహీనతను నివారిద్దాం

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నిర్మల్‌టౌన్‌: ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన ర్యాలీ తీశారు. అనంతరం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌ మాట్లాడుతూ.. హీమోఫిలియా పురుషులలో ఎక్కువగా కనిపించే వ్యాధి అన్నారు. మన శరీరంలో రక్తస్రావాన్ని నియంత్రించే జన్యువులలో మార్పుల కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్తస్రావ రుగ్మతల సంఘానికి మద్దతు ఇవ్వడానికి, వయసు, లింగం లేదా నివాస ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ రుగ్మతలతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ సంరక్షణ , చికిత్స అందుబాటులో ఉండేలా ప్రోత్సహించడానికి ఈ రోజును అంకితం చేశారన్నారు. ప్రస్తుతం ఈ రక్తస్రావ రుగ్మతకు ఎటువంటి నివారణ లేదని, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్‌ సమత, డాక్టర్‌ విశ్వనాథ్‌, కిరణ్‌, నర్సింగ్‌ ఆఫీసర్లు వనజ, విజయలక్ష్మి, పారిజాతం బ్లడ్‌ బ్యాంక్‌ డీఈవో రాకే శ్‌, నర్సింగ్‌ ఆఫీసర్లు, నర్సింగ్‌ కాలేజ్‌ విద్యార్థులు, బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Advertisement
 
Advertisement
Advertisement