● ఎమ్మెల్యే పి.రామారావు పటేల్
భైంసాటౌన్: నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ప్రభుత్వం 30కిపైగా సబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విన్నవించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అధిక మొత్తంలో రైతులు మొక్కజొన్న సాగుచేశారని ఆయనకు వివరించారు. ప్రధాన కొనుగోలు కేంద్రాలతోపాటు సబ్ సెంటర్ల ఏర్పాటుతో పంట అమ్మకానికి రైతులకు ఇబ్బందులు తొలగుతాయని ఆయన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.


