పర్యాటక శోభ | - | Sakshi
Sakshi News home page

పర్యాటక శోభ

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

జిల్లాలో లక్ష్మణచాంద ఊర చెరువుకు గుర్తింపు ఇది వరకే పూర్తయిన సర్వే.. ప్రభుత్వానికి అటవీశాఖ ప్రతిపాదన మారనున్న చెరువు రూపురేఖలు

చిత్తడి చెరువుకు

ప్రతిపాదనలు ఇలా..

● చెరువు సరిహద్దు, కృత్రిమంగా పక్షుల ఆవాసం ఏర్పాటు కోసం రూ.20 లక్షలు

● చెరువులోని మట్టి, ఇతర వ్యర్ధాల తొలగింపునకు రూ.10 లక్షలు.

● చెరువు చుట్టూ వృక్ష జాతుల పెంపకం కోసం రూ.20 లక్షలు.

● చెరువులోని కలుపు మొక్కల తొలగింపు కోసం రూ.20 లక్షలు

● నీటి వసతి చేప పిల్లలు విడుదల కోసం చెరు వు, అభివృద్ధి పనుల కోసం రూ. 25 లక్షలు

● ఎకో టూరిజం అభివృద్ధి కోసం రూ.30 లక్షలు

● పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు రూ.10 లక్షలు

● చెరువు కట్ట అభివృద్ధి కోసం రాతి కట్టడం ఏర్పాటు, తూము రిపేర్లు, కాలువల మరమ్మత్తుల కోసం రూ.15 లక్షలు.

● ఇతర అవసరాల కోసం రూ.10 లక్షలు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు.

లక్ష్మణచాంద: భూమిపై పొరలలో నీటిని నిల్వ ఉంచుకునే నేలలను తడిగా ఉండే నేలలను చిత్తడి నేలలుగా భావిస్తారు. ఇందులో ప్రధానంగా చెరువులు, సరస్సులు, మడ వనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యా ప్తంగా ఈ రకం నేలలు కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ 4 శాతం నేలపైనే ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం జీవులు నివసిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. చిత్తడి నేలలు పలు రకాల జీవులు నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. వివిధ రకాల మొక్కలు, వృక్ష జాతులు, పక్షులు, చేపలు, నీటిలో పెరిగే వివిధ రకాల జీవరాసుల ఆవాసానికి ఈ నేలలు అనుకూలం. జనాభా పెరుగుదల, పట్టణీకరణ నేపథ్యంలో చిత్తడి నేలల చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. జీవుల మనుగడకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు మురికి నీటి వ్యర్ధాలు, పరిశ్రమల వ్యర్ధాలు ఈ చెరువుల్లోకి చేరడంతో నీరు కలుషితమై జీవజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతోంది. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. దీనిని అరికట్టేందుకు చిత్తడి నేలలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడి జీవుల మనుగడ సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

నిర్మల్‌ జిల్లాలో....

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జిల్లా అధికారులు సూచించిన సూచనల మేరకు జిల్లాలోని లక్ష్మణచాంద ఊర చెరువును, సో న్‌ మండలం పాక్‌పట్ల గ్రామంలోని మొసళ్ల చెరువును జిల్లా అటవీ శాఖ అధికారుల బృందం, రెవె న్యూ అధికారులు, ఇరిగేషన్‌, మత్స్యశాఖ, టూరి జం అధికారులు కలిసి పరిశీలించారు. అనంతరం అధికారుల బృందం సర్వే చేసింది. ఇందులో లక్ష్మ ణచాంద ఊర చెరువు, సోన్‌ మండలం పాక్‌పట్ల లో ని మొసళ్ల చెరువును చిత్తడి నేలగా అధికారుల బృందం గుర్తించారు. కానీ పాక్‌పట్ల మొసళ్ల చెరువును చిత్తడి నేలగా అభివృద్ధి చేయడానికి ఇరిగేషన్‌ అధి కారులు అభ్యంతరం తెలిపారు. దీంతో జిల్లాలో కేవలం లక్ష్మణచాంద ఊర చెరువును ఒక్కటే చిత్తడి నేలగా గుర్తించారు. అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

గుర్తించిన జీవవైవిధ్యం

సర్వేలో లిటిల్‌ గ్రేబ్‌, లార్జ్‌ ఎర్జెట్‌, ఓరియంటల్‌ డార్టర్‌, పర్పుల్‌ స్పామ్‌ పెన్‌, బ్లాక్‌ వింగ్డ్‌ స్టిల్ట్‌, రుడీ షెల్‌ డక్‌, స్పాట్‌ బిల్డ్‌ డక్‌, రెడ్‌ వాట్లెగ్డ్‌ లాప్‌వింగ్‌ వంటి పక్షులు కనుగొన్నారు. వృక్షాలు, జలజీవులు కూడా ఉన్నాయి. దీనిని అభివృద్ధి చేస్తే ఆక్రమణలు తగ్గుతాయి. కాలుష్యం నియంత్రించే అవకాశం ఉంటుంది. చెరువు శుభ్రం అవుతుంది. పక్షులకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేస్తారు. చేపలు పెరుగుతాయి. చెరువు చుట్టూ వృక్షాలు నాటి పర్యాటకంగా అభివృద్ధి చేస్తారు.

పర్యాటకంగా అభివృద్ధి

లక్ష్మణచాంద ఊర చెరువును చిత్తడి నేల కింద ఎంపిక చేశాం. ఇందులో అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్‌, మత్స్య శాఖ, టూరిజం శాఖ అధికారులతోపాటు, సర్పంచ్‌, గ్రామస్తుల సహకారంతో ఎంతో ఉంది. చెరువు హద్దులు గుర్తించడం, మట్టిని తొగించడం, పర్యాటకంగా అభివృద్ధి అవుతుంది. దీంతో మండల కేంద్రం ప్రజలతోపాటు ఇతర గ్రామాల ప్రజలు వస్తారు. దీంతో స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – శ్రీనివాసరావు,

ఎఫ్‌ఆర్వో, దిమ్మదుర్తి రేంజ్‌

Advertisement
 
Advertisement
Advertisement