నిర్మల్‌టౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ వెలుమల ప్రభాకర్ అన్నారు. గెజిటెడ్ అధి కారులు, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షనర్ల సమస్య ల పరిష్కార కార్యాచరణలో భాగంగా శుక్రవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల బిల్లులను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన మరో 64 డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జి ల్లా జనరల్ సెక్రెటరీ పి.గంగారెడ్డి, అడిషనల్ సెక్రెటరీ నరేంద్రబాబు, కోచైర్మన్ లక్ష్మణ్, రమేశ్, కూడా ల రవికుమార్, రవికాంత్, శంకర్, విజయ్ కుమా ర్, దేవేందర్, కృష్ణారావు, హరిప్రసాద్, మహేంద్రచారి, సత్యపాల్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్, అశోక్‌కుమార్, జాదవ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


