లక్షలు వెచ్చించారు.. వృథాగా వదిలేశారు | - | Sakshi
Sakshi News home page

లక్షలు వెచ్చించారు.. వృథాగా వదిలేశారు

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన చేపల విక్రయ కేంద్రం వృథాగా మారింది. 2023లో భాగ్యనగర్‌ సమీపంలోని విశ్వేశ్వరయ్య మార్గ్‌లో దాదాపు రూ.65 లక్షల మత్స్యశాఖ నిధులతో నిర్మించిన ఈ ఆధునిక చేప ల మార్కెట్‌ ప్రారంభించిన నాటి నుంచి విని యోగంలేక వృథాగా పడిఉంది. మత్స్యకారులు, విని యోగదారుల సౌకర్యార్థం విక్రయాల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన ఈ భవనంలో గ్రానైట్‌ ప్లాట్‌ఫామ్‌లు, చేపలశుద్ధి క్యాబిన్‌లు ఏర్పాటు చేశారు. అయితే వినియోగంలోకి తీసుకురావడంలో అధికా రుల అలసత్వం వహిస్తున్నారు. దీంతో మత్స్యకారులు ఇప్పటికీ ఆరుబయట ఎండలోనే చేపల విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఖాళీగా ఉన్న భవ నం శిథిలావస్థకు చేరుతోంది. ఫ్లోరింగ్‌, గ్రానైట్‌ రా ళ్లు పగిలిపోవడం, భవనం రూపురేఖలు మారిపోవడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రివేళల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా అధికారులు అందుబాటులోకి తీసుకురావాలని పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement