ఎండల తీవ్రతపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఎండల తీవ్రతపై అవగాహన కల్పించాలి

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

● డీఎంహెచ్‌వో రాజేందర్‌

● డీఎంహెచ్‌వో రాజేందర్‌

దిలావర్‌పూర్‌: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అప్రమత్తం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ సూచించారు. మండల దిలావర్‌పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఓరల్‌ డీహైడ్రేషన్‌ సాల్ట్‌ ప్యాకెట్లు అందించాలని సూచించారు. వీటిని ప్రతీ ఆశకార్యకర్త వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలు హెచ్‌పీవీ వాక్సిన్‌ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. డిప్యూటీ విస్తరణాధికారి బారె రవీందర్‌, డీపీవో రాంచందర్‌, మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రియాంక, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement