వినియోగదారులను మోసం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులను మోసం చేయొద్దు

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

● డీఎల్‌ఎంవో శంకర్‌

● డీఎల్‌ఎంవో శంకర్‌

కుంటాల: దుకాణదారులు వ్యాపారాల్లో విని యోగదారులను మోసం చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని డీఎల్‌ఎంవో శంకర్‌ హెచ్చరించారు. కుంటాలలో దుకాణాలు, హోటళ్లు, స్వీట్‌ హౌస్‌లను గురువారం తనిఖీ చేశారు. దుకాణాల్లో వినియోగించే త్రాసులు, రాళ్లు, ఎలక్టాన్రిక్‌ యంత్రాలకు ఏటా సీల్‌ వేయించుకోవాలని సూచించారు. వస్తుపై ఉన్న గరిష్ట ధర కన్నా ఎక్కువకు విక్రయించొద్దన్నారు. వస్తువులపై గడువు ముగిసే తేదీ స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో అసిస్టెంట్‌ అధికారి రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది రాజ్‌కుమార్‌, అయాజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement