● జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి
మామడ: ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి అన్నారు. మామడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలస్థాయి సమావేశం నిర్వహించారు. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అధికారులు, సర్పంచులు ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో శంకర్, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఉన్నారు.


