ఆర్టిజన్ల ఆక్రందన! | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్ల ఆక్రందన!

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్‌ చేయాలి.

ఉద్యోగులందరికీ ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి.

మిగిలిపోయిన కార్మికులను కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలి.

పీస్‌ రేట్‌ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలి. 30 రోజులు పని కల్పించాలి.

04.12.2016 వరకు అన్ని అర్హతలు ఉండి సంస్థల విలీనం కానీ కాంట్రాక్ట్‌ కార్మికులను సంస్థలు విలీనం చేసుకోవాలి.

ఆందోళన ఉధృతం చేసిన కార్మికులు ఎనిమిదోరోజుకు నిరవధిక దీక్ష క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో సమస్యలు

నిర్మల్‌చైన్‌గేట్‌: విద్యుత్‌ కార్మికులపై జెన్‌కో, ఎన్పీడీసీఎల్‌ సంస్థలు వివక్ష చూపుతున్నాయి. అపరిష్కృత సమస్యలు పట్టించుకోకపోవడంతో కార్మికులకు ఆర్థిక నష్టం కలుగుతోంది. దీంతో సమ్మె బాట పట్టి న ఆర్టిజన్‌ కార్మికులు, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ ర్కర్లు ఆందోళన ఉధృతం చేశారు. విధులు బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారం నాటి కి ఎనిమిదోరోజుకు చేరింది. వీరి సమ్మె ప్రభావం విద్యుత్‌ సరఫరాపై పడనుండగా అధికారులు ప్ర త్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థా యి పనులకు సిబ్బంది కొరత ఉంది. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.

ప్రజలకు కరెంట్‌ కష్టాలు

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజ లకు కరెంట్‌ కష్టాలు తప్పేలా లేవు. ఓ వైపు సమ్మె విరమించాలని కార్మికులను ట్రాన్స్‌కో బెదిరింపులకు పాల్పడుతున్నా వారు ఖాతరు చేయకుండా

పోరాటం కొనసాగిస్తున్నారు. ఒకే సంస్థ అయినప్ప టికీ రెండు నిబంధనలు అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి కనీస ప్రయోజనాలు వర్తించడం లేదు. కన్వర్షన్‌ అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 170 మంది ఆర్టిజన్‌ ఉద్యోగులు, 59 మంది అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు పని చేస్తున్నారు. వీరంతా డివిజనల్‌ కార్యాలయాల ఎదుట నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు.

సమ్మెలో పాల్గొనద్దని హెచ్చరికలు

కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిన విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు సమ్మెలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆర్టిజన్‌ కార్మికులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం ఏకంగా ఎస్మా ప్రయోగిస్తూ కార్మికులకు నోటీసులు పంపించి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. అయినప్పటికీ ఎనిమిదోరోజూ ఆర్టిజన్లు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నట్లు, నిరవధిక దీక్ష శిబిరంలో పాల్గొన్నట్లు జేఏసీ నాయకులు చెబుతున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

సమ్మెతో సిబ్బంది కొరత

ఆర్టిజన్‌ కార్మికులు, అన్‌మ్యాన్డ్‌ వర్కర్లు సమ్మెకు దిగడంతో సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. సమ్మె నోటీస్‌ ఇచ్చినప్పటికీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఈ దశలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు, ఈదురు గాలులు తదితర సమస్యలు ఎదురైతే ప్రజలకు కరెంట్‌ కష్టాలు తప్పవు. సమ్మె ప్రభావం సంస్థతోపాటు ప్రజలపై చూపనుంది.

విధుల్లో జేఎల్‌ఎంలు, లైన్‌మెన్‌లు

ఆర్టిజన్‌ కార్మికుల సమ్మెతో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద జూనియర్‌ లైన్‌మెన్‌లు, లైన్‌మెన్‌లకు ఉన్నతాధికారులు డ్యూటీలు వేశారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ, వ్యవసాయ ఫీడర్లు, గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్ద సమస్యలు వచ్చినా.. కరెంట్‌ వైర్లు తెగిపడినా అక్కడికి వీళ్లు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. నిజానికి జూనియర్‌ లైన్‌మెన్‌లు, లైన్‌మెన్‌లలో 90 శాతం మందికి స్తంభాలు ఎక్కడం రాదని అధికారులు చెబుతున్నారు. ఈ పనులన్నింటినీ లైన్‌మెన్‌లు, ఆర్టిజన్‌ కార్మికులతో చేయించేవారు. వారు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు పెరుగుతున్నాయి. మరోవైపు కార్మికుల సమ్మె కారణంగా ఈ నెల కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ పెండింగ్‌ పడినట్లు కూడా చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement