ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

భైంసాటౌన్‌: వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ భైంసా అధికారి రవి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో అగ్ని మాపక సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరించా రు. అనంతరం ఫైర్‌ అధికారి రవి మాట్లాడుతూ.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 20వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరి గితే వెంటనే అగ్నిమాపకశాఖకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం హరిప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో మాక్‌డ్రిల్‌

నిర్మల్‌టౌన్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణంలో మా క్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. నిర్మల్‌ ఫైర్‌ స్టేషన్‌ అధికారి శివాజీ అగ్నిప్రమాదల నివారణపై అవగాహన క ల్పించారు. ఆయన మాట్లాడుతూ.. షాపింగ్‌ మా ల్స్‌, ఆస్పత్రి, ఫ్యాక్టరీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదం సంభవిస్తే వెంటనే 101, 100 టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న శివాజీ

Advertisement
 
Advertisement
Advertisement