‘ఓపెన్‌’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

నిర్మల్‌చైన్‌గేట్‌: ఓపెన్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం, తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 20నుంచి 27వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 1,035 మంది పదోతరగతి, 821 మంది ఇంటర్‌ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప దోతరగతికి ఐదు, ఇంటర్‌కు నాలుగు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపా రు. దూరప్రాంత విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా అవసరం మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. డీఈవో భో జన్న, డీఐఈవో పరశురాం, తపాలాశాఖ ఇన్‌స్పెక్టర్‌, ఏసీజీఈ పరమేశ్వర్‌, ఆర్టీసీ, వైద్యశాఖ అధికా రులు రమేశ్‌, సౌమ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement