భైంసాటౌన్: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తెలు సుకోవాలని ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రధాన రహదారులు దాటే క్రమంలో జీబ్రా క్రాసింగ్ పాటించాలని సూచించారు. పిల్లలు వాహనాలు నడుపవద్దని, తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించేలా కోరాలని చెప్పారు. విద్యార్థులు అరైవ్–అలైవ్ ఆంగ్ల అక్షరాకృతిలో కూర్చుని ఆకట్టుకున్నారు. అలాగే మానవహారం ఏర్పాటు చేశారు. వీరితో రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. పట్టణ సీఐ సాయికుమార్, సిబ్బంది ఉన్నారు.


