నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణాభివృద్ధికి గతంలో మంజూరైన రూ.15 కోట్ల నిధులతో చేపట్టనున్న పనుల టెండర్లను నూతన మున్సిపల్ పాలకవర్గం రద్దు చేస్తామంటోందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని కోరు తూ.. బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయన వెంట పట్టణాధ్యక్షుడు సుంకరి సాయి, బీజేపీ కౌన్సిలర్లు శ్రీరామోజు నరేశ్, కూన శశాంక్, ముత్యం, ధర్మాజీగారి ఈశ్వర్, విఠల్, ఖమ్మం సురేందర్ తదితరులున్నారు.


