నిర్మల్ రూరల్: ఆడపిల్ల చదువులు, పెళ్లి రోజు రోజుకు భారమవుతున్న నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకు సహాయం చేద్దామని సదుద్దేశంతో నిర్మల్ మండలం అనంతపేట సర్పంచ్ మాదాస్తు సునీత ముందుకు వచ్చారు. గ్రామంలో పుట్టిన ప్రతీ ఆడపిల్ల పేరిట రూ.5 వేలు డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. రెండు శ్రీగంధం మొక్కలు అందిస్తామని తెలిపారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని మంగళవారం కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటి నుంచి పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఓ ఆడబిడ్డకు రూ.5 వేలు, రెండు శ్రీగంధం మొక్కలు అందించారు.


