రోడ్డు భద్రత.. అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

● ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి ● డీజీపీ శివధర్‌రెడ్డి ● సోన్‌లో అరైవ్‌ అలైవ్‌పై అవగాహన

లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలకు భద్రతను పెంచడమే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అరైవ్‌ – అలైవ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తె లిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌ జి ల్లా సోన్‌ మండల కేంద్రంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీజీపీ హాజరయ్యారు. ముందుగా డప్పు చప్పుళ్ల మధ్య, ఆదివాసీల గుస్సాడీ నృత్యం చేస్తూ ఘన స్వాగతం పలికారు. రోడ్డు భద్రతపై డీజీపీ మాట్లాడారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించడం తప్పనిసరి అన్నారు. మద్యం సేవించి వాహనం నడుపొద్దని సూచించారు. ఈ సందర్భంగా ’అరైవ్‌ అలైవ్‌’ బ్రోచర్లు ఆవిష్కరించి, గ్రామస్తులు, అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలనిసూచించారు.

రోడ్డు ప్రమాదాల్లోనే అధిక మరణాలు..

రాష్ట్రంలో అధిక శాతం మరణాలు రోడ్డు ప్రమాదా ల్లోనే సంభవిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ట్రాఫిక్‌ నియమాలపై పూర్తి అవగా హన కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించ డం వల్ల కుటుంబాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహ నం నడపడం, మైనర్‌ డ్రైవింగ్‌ను ప్రోత్సహించొద్దని సూచించారు. ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, యువకులు, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అధికారులకు ఆదేశించారు.

వారోత్సవాలకే పరిమితం కాకూడదు

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మాట్లాడుతూ ’ప్రజా పాలన – ప్రగతి’ ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ’అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధ్యతాయుతంగా ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమాలు కేవలం వారోత్సవాలకే పరిమితం కాకుండా, ఎల్లప్పుడూ రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ మైనర్‌ పిల్లలకు వాహనాలు అందించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

జీవితం అమూల్యమైనది..

ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, గ్రామస్తులు ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన పెంచుకోవడమే కాకుండా, ఆ విషయాలు ఇతరులకు కూడా తెలియజేయాలని కోరారు. జీవితం అమూల్యమైనది కాబట్టి దానిని కాపాడుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనదారులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవడమే ’అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనంతరం సోన్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో డీజీపీ పాల్గొన్నారు. భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, నిర్మల్‌ ఏఎస్పీ సాయికిరణ్‌, డీపీవో శ్రీనివాస్‌, డీఎఫ్‌వో సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే, డీపీవో శ్రీనివాస్‌, ఎంవీఐ మహేందర్‌, పోలీసు అధికారులు, ఇతర అధికారులు, సర్పంచ్‌ వనజ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement