భానుడి భగభగ | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగ

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. మంగళవారం జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మధ్యాహ్నం బయటకు రావడానికి జనం జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పనుల కోసం బయటకు వెళ్లేవారు తలకు క్యాప్‌లు పెట్టుకుంటున్నారు. కాటన్‌ దుస్తులు ధరిస్తున్నారు. ఉక్కపోత కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా పనిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

ఎండవేడి తాళలేక ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement