ఖానాపూర్: బీఆర్‌ఎస్‌తో అక్రమ పొత్తుతో మున్సిపల్ పీఠం దక్కించుకున్న బీజేపీ అసలు విషయాన్ని దాచిపెట్టి, రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్‌లో మంగళవారం మాట్లాడారు. ఇక్కడేదో గొప్ప సాధించినట్లు ఖానాపూర్ సెగ ముఖ్యమంత్రికి తగలాలని చెప్పడం అవివేకమన్నారు. నిజానికి రాష్ట్రంలోని బీజేపీ నాయకులకే ‘‘బొజ్జు సెగ’’ గట్టిగా తగిలిందని వ్యాఖ్యానించారు. ఖానాపూర్ బీజేపీ–బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ‘‘లవ్ జిహాద్’’ బయటపడిందని ఆరోపించారు. సోమవారం ఖానాపూర్‌కు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ గెడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ చేసిన ఆరోపణలను ఖండించారు. పట్టణ ప్రజలు మూడు పార్టీలను సమానంగా ఆదరిస్తే, అక్రమ పొత్తుతో చైర్మన్ పదవి దక్కించుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య ఉన్న అక్రమ పొత్తుతోనే చైర్మన్ పీఠం దక్కిందని, ఈ విషయం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ పాత్రపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఒకలా, తరువాత మరోలా వ్యవహరిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ.రెండు కోట్లకు అమ్ముడై మత రాజకీయాలకు సహకరించారని విమర్శించారు. ఖానాపూర్‌లో ఈ రెండు పార్టీలు కలిసి మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, హిందూ–ముస్లిం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలు ఆపాలని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం పట్టణంలో అమలు చేయిస్తామని తప్పుడు హామీలు ఇచ్చారని, పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి ప్రశాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, ఆత్మ చైర్మన్ గాడ్పు సత్యం, డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్నం సత్యం, పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్, సర్పంచుల ఫోరం మండ ల అధ్యక్షుడు గుగ్లావత్ రాజేందర్‌నాయక్, కౌన్సి లర్లు, నాయకులు నిమ్మల రమేశ్, గొర్రె గంగా ధర్, జంగిలి శంకర్, జన్నారపు శంకర్, చింతల మల్లేశ్, కిశోర్‌నాయక్, స్వప్నిల్‌రెడ్డి, రాజేశ్వర్, శేషాద్రి, ధర్మరాజు, రాజేశ్వర్, మల్లేశ్, శ్రీహరి పాల్గొన్నారు.


