నిర్మల్: అయ్యప్ప శరణుఘోషతో జిల్లా కేంద్రం మార్మోగింది. అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీచౌక్‌లో 16వసారి విషూ మహాపడిపూజ మంగళవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన భార్గవ గురుస్వామి ఆధ్వర్యంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు పూజ, భజన బృందాల కార్యక్రమాలు కొనసాగాయి. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు బద్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కనపర్తి విఘ్నేశ్, కోశాధికారి కుంటాల సాయినాథ్ తదితరులు ఏర్పాట్లు చేశారు.
విషూ పూజలకు హాజరైన భక్తులు


