● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: అర్జీదారుల సమస్యలపై తక్షణం స్పందించాలని ఎస్పీ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. సామాన్యులకు అండగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


