నిర్మల్‌టౌన్: వాహనదారులు నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఆర్టీసీ నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ‘అరైవ్ అలైవ్’ పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్ డిపో నుంచి శివాజీ చౌక్ వరకు ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మె ట్ ధరించాలని, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. వాహనాలు నడిపే ముందు కుటుంబాలను గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.నవీన్‌కుమార్, ఎస్టీ శకుంతల, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.


