ముగిసిన ‘పది’ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘పది’ పరీక్షలు

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

నిర్మల్‌ రూరల్‌: దాదాపు నెలరోజులపాటు సాగిన పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ముగిశాయి. చివరి రోజు విద్యార్థులకు సోషల్‌ స్టడీస్‌ పరీక్ష నిర్వహించారు. చివరి పరీక్షకు మొత్తం 9,748 మంది విద్యార్థులకు 9,742 మంది హాజరయ్యారు. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్‌ 13 వరకు జరిగాయి. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలోని సెయింట్‌ థామస్‌ పాఠశాలలో స్పాట్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నెల రోజులు ఒత్తిడితో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో సంతోషంగా గెంతులేశారు. మొత్తంగా, పరీక్షల ముగింపు విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

పరీక్ష కేంద్రం ఆవరణలో విద్యార్థుల మాటామంతి..

Advertisement
 
Advertisement
Advertisement