మక్కలు కొనాలని వినతి | - | Sakshi
Sakshi News home page

మక్కలు కొనాలని వినతి

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

కుంటాల: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా నాయకుడు జీవీ.రమణారావు, కుంటాల సర్పంచ్‌ జక్కుల గజేందర్‌ మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని కో రారు. హైదరాబాద్‌లో శనివారం కలిసి వినతి పత్రం అందించారు. పంట చేతికొచ్చి 15 రోజు లైనా కొనుగోళ్లు ప్రారంభించలేదని తెలిపారు. అకాల వర్షాల కారణంగా రైతులు చేతికి వచ్చిన పంట నష్టపోతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఎండీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement