● పరీక్షలే జీవితం కాదు..! ● ఒక్క ఫలితమే నిర్ణయించలేదు ● నేడు ఇంటర్మీడియెట్‌ ఫలితాలు ● ఒత్తిడికి గురైతే టెలిమానస్‌ నంబరు 14416లో సంప్రదించవచ్చు | - | Sakshi
Sakshi News home page

● పరీక్షలే జీవితం కాదు..! ● ఒక్క ఫలితమే నిర్ణయించలేదు ● నేడు ఇంటర్మీడియెట్‌ ఫలితాలు ● ఒత్తిడికి గురైతే టెలిమానస్‌ నంబరు 14416లో సంప్రదించవచ్చు

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

● పరీక్షలే జీవితం కాదు..! ● ఒక్క ఫలితమే నిర్ణయించలేదు ● నేడు ఇంటర్మీడియెట్‌ ఫలితాలు ● ఒత్తిడికి గురైతే టెలిమానస్‌ నంబరు 14416లో సంప్రదించవచ్చు

పరీక్ష ఫలితాల్లో ఫెయిలైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చదువు కొనసాగించడం.. మార్కులు పెంచుకునేందుకు బోర్డు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఫెయిలైన సబ్జెక్టులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సంవత్సరం ఉన్నత చదువులకు వెళ్లేందుకు వీలుంటుంది. తమకు వచ్చిన మార్కుల(మార్కులు తక్కువొచ్చినా, ఫెయిలైనా)పై నమ్మకం లేని విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాసైనా మార్కులు తక్కువొచ్చాయని భావిస్తే విద్యార్థులు బెటర్మెంట్‌ పరీక్షలు రాసి మెరుగుపర్చుకోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చి పలుచన చేయకుండా తల్లిదండ్రులు సన్నిహితంగా ఉంటూ ధైర్యం కల్పించాలి.

ఈ చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న యువకుడు నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన పంతిక ప్రవీణ్‌. ఎంసీఏ పూర్తి చేశాడు. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో స్వయంశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పౌల్ట్రీ రంగంలో మెలకువలు నేర్చుకుని ప్రభుత్వ రుణ సదుపాయంతో పౌల్ట్రీఫామ్‌ నెలకొల్పాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. శిక్షణ ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు వ్యవసాయం, పౌల్ట్రీఫాంను సందర్శించి అతడిని అభినందించారు. ఉద్యోగంలో ప్రవేశిస్తే ఎక్కడో ఒకచోట మాత్రమే పరిమితమైన సేవలందించే వాడినని, ప్రస్తుతం మరో పదిమందికి ఉపాధి కల్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రవీణ్‌ చెబుతున్నాడు.

నిరుత్సాహం దరిచేరనీయొద్దు

పరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని ఫెయిల్‌ అయ్యామని చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. భావోద్వేగాలను సమన్వయపర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించే గాథలు, అనుభవాలను వారితో పంచుకోవాలి. పరీక్షలే జీవితానికి పరమావధి కాదని వారికి తెలియజెప్పాలి. జీవితంలో ఎదిగేందుకు అనేక మార్గాలు ఉంటాయని అవగాహన కల్పించాలి. – మోత్కూరి రామచందర్‌,

రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌

నిరాశ వద్దు..

ఇంటర్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు

పౌల్ట్రీరంగంలో ఎదిగి..

Advertisement
 
Advertisement
Advertisement