పూలే మార్గంలో నడవాలి | - | Sakshi
Sakshi News home page

పూలే మార్గంలో నడవాలి

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే చూపిన మార్గాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్డీవో రత్నకళ్యాణి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పూలే జయంతి వేడుకలు శని వారం నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు జ్యోతి బాపూలే అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శా ఖ అధికారి శ్రీనివాస్‌, డీఈవో భోజన్న, అసిస్టెంట్‌ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్జీయూకేటీలో..

బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆ ధ్వర్యంలో డాక్టర్‌ రెవెల్లి అజయ్‌ అధ్యక్షతన మహా త్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌, డీన్‌ విఠల్‌, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని పూలేకు నివాళులర్పించారు. అణగారినవర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత కోసం పూలే చేసిన విశేష కృషిని వీసీ, డీన్‌ కొనియాడారు. అందరికీ విద్య అందాలన్న పూలే ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement