● రేపటి నుంచి నిర్మల్, సారంగపూర్‌లో కొనుగోళ్లు ● మార్కెట్ కమిటీల చైర్మన్లు భీమ్‌రెడ్డి, అబ్దుల్ హాదీ
నిర్మల్‌చైన్‌గేట్/సారంగాపూర్: రబీ సీజన్‌లో రై తులు పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి, సారంగాపూర్ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ సూచించారు. నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులో రైతులకు శనివారం టోకెన్లు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యా ర్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగో లు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ధూ మ్డా నాయక్, నాయకులు భూమారెడ్డి, పోతా రెడ్డి, రమేశ్, సాయన్న, రైతులు పాల్గొన్నారు.


